భారతీయ సంగీత సామ్రాజ్యాన్ని సుసంపన్నం చేసిన ఎందరో మహనుభావులు - అందరికీ పాదాభివందనాలు. సంగీతమే ప్రాణంగా, ఆధ్యాత్మికతే జీవితంగా గడిపిన ఎందరో వాగ్గేయకారులు మన భారతదేశంలో ఉన్నారు. 

నాదోపాసనలో తరించిన మహానుభావులు లౌకిక సుఖాలకు, పేరు ప్రఖ్యాతులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

కారణంగా ఆయా వాగ్గేయకారులకు రావలసినంత ఖ్యాతి లభించలేదు. వారి జీవితాలు ధారపోసి సృజించిన సంగీత సంపద, వారి జీవిత విశేషాలను ఈ తరానికి అందించాలన్న ఆశయంతో అజ్ఞాత వాగ్గేయకరులు అనే కార్యక్రమాన్ని మీ అభిమాన శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానల్ లో ధారావాహికంగా అందిస్తున్నాము.

ఈ కార్యక్రమాన్ని వీక్షించండి! సంగీతాభిమానులకు తెలియపరచండి.

మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియపరచండి..

 

 

 
 
 

Copyright  Ajnathavaggeyakarulu.com 2012. All rights reserved.                                                                                                                          Site by Agnatech